సొసైటీ, ఆదిలాబాద్ : రాజ్‌పుత్ సమాజ్ యువజన విభాగం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూత్ ప్రెసిడెంట్‌గా ఠాగూర్ విశాల్ సింగ్, జనరల్ సెక్రటరీగా ఠాగూర్ ఆకాశ్ సింగ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా విశాల్ సింగ్ మాట్లాడుతూ రాజ్‌పుత్ సమాజ్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. బాలాజీనగర్‌లో పెండింగ్‌లో ఉన్న సమాజ్ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, ఏసీ ఫంక్షన్ హాల్‌గా అభివృద్ధి చేసేందుకు సహకరిస్తానని తెలిపారు. నూతన కార్యవర్గానికి మాజీ యూత్ ప్రెసిడెంట్లు పోతివాల్ లక్ష్మణ్ సింగ్, జగత్ ప్రతాప్ సింగ్ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్దల కమిటీ అధ్యక్షుడు బాలాజీ సింగ్, ప్రధాన కార్యదర్శులు మహేష్ సింగ్, ప్రతాప్ సింగ్, విజయ్ సింగ్ (శేఖావత్) తదితరులు పాల్గొన్నారు.
రాజ్‌పుత్ యూత్ ప్రెసిడెంట్‌గా ఠాగూర్ విశాల్..
RELATED ARTICLES
