Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Friday, September 11, 2026
HomeUncategorizedబీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా అంగల్‌వార్‌ చరణ్‌...

బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా అంగల్‌వార్‌ చరణ్‌ గౌడ్‌..

సొసైటీ, ఆదిలాబాద్:బీజేపీ ఓబీసీ మోర్చా ఆదిలాబాద్‌ జిల్లా ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా అంగల్‌వార్‌ చరణ్‌గౌడ్‌ నియమితులయ్యారు. గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎంపీ గోడం నాగేష్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్‌ చేతుల మీదుగా చరణ్‌గౌడ్‌ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ ఓబీసీ వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన పార్టీ నాయకత్వానికి చరణ్‌గౌడ్‌ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ ఆదిలాబాద్‌ రూరల్‌ మండల అధ్యక్షుడు బంతిపెల్లి దయాకర్‌, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కుంచెటి సంతోష్‌, నాయకులు దత్తు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments