బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అంగల్‌వార్ చరణ్ గౌడ్..
సొసైటీ, ఆదిలాబాద్:బీజేపీ ఓబీసీ మోర్చా ఆదిలాబాద్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అంగల్‌వార్ చరణ్‌గౌడ్ నియమితులయ్యారు. గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎంపీ గోడం నాగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ చేతుల మీదుగా చరణ్‌గౌడ్ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ ఓబీసీ వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని...