Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Wednesday, July 22, 2026
HomeUncategorizedటీఎన్జీవోస్ ఉట్నూర్ నూతన కమిటీ ఎన్నిక..

టీఎన్జీవోస్ ఉట్నూర్ నూతన కమిటీ ఎన్నిక..

సొసైటీ,ఆదిలాబాద్ :టీఎన్జీవోస్ ఉట్నూర్ యూనిట్ నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా జీ. నితిన్ కుమార్ వ్యవహరించారు. టీఎన్జీవోస్ ఉట్నూర్ యూనిట్ అధ్యక్షుడిగా ఎండి.తౌసిఫ్, సెక్రటరీగా ఎన్.రవీందర్, ఉపాధ్యక్షులుగా ఎం.ముకుంద రావు, బి.రవీందర్, టి. రోహిణి, జాయింట్ సెక్రెటరీలుగా కలీమ్ అన్సారి, పృధ్విరాజ్, ఏ.స్రవంతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పిహనుమంత్, కోశాధికారిగా ఎస్.తరుణ్ యాదవ్, పబ్లిక్ సెక్రెటరీగా మిర్జా ముంతాజ్ అలీ బేగ్, ఈసీ మెంబర్లుగా జి. గంగామణి, ప్రవీణ్ కుమార్, జాదవ్ హిరాలాల్, సాయి కృష్ణ, సతీష్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో నూతనంగా ఎన్నికైన సభ్యులను టీఎన్జీవో జిల్లా సెక్రెటరీ ఏ. నవీన్ కుమార్ శాలువాలతో సత్కరించి.. నియామక పత్రాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఉద్యోగుల పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేసేలా సంఘం పనిచేస్తోందన్నారు. నూతన కమిటీ సభ్యులు సంఘం బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. నూతన కమిటీ కాలపరిమితి 2026 సంవత్సరం నుండి 2029 సంవత్సరం వరకు ఉంటుందని తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments