Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Thursday, June 11, 2026
HomeUncategorizedసర్పంచ్‌పై వార్డు సభ్యుల ఫిర్యాదు..

సర్పంచ్‌పై వార్డు సభ్యుల ఫిర్యాదు..

సొసైటీ,ఆదిలాబాద్ : మావల మండలంలోని బట్టిసావర్‌గాం గ్రామ సర్పంచ్ మిటిపెల్లి శ్రీనివాస్ రెడ్డిపై ఉపసర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం,వార్డు సభ్యుల పట్ల వివక్ష,అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వంటి అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం,తమ పార్టీకి చెందిన వారు కాదనే కారణంతో సర్పంచ్ తమ వార్డుల్లో అభివృద్ధి పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని వార్డు సభ్యులు ఆరోపించారు. విద్యుత్ బల్బుల ఏర్పాటు,మురికి కాలువల శుభ్రపరిచే పనులు,బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి సాధారణ పనులు కూడా చేయనివ్వడం లేదని తెలిపారు.అదే విధంగా పంచాయతీ నిధులతో కొనుగోలు చేసిన ఎల్ఈడీ బల్బుల విషయంలో భారీగా అధిక ధరలు చూపిస్తూ తప్పుడు బిల్లులు సమర్పించారని ఆరోపించారు.మార్కెట్‌లో తక్కువ ధరకు లభించే బల్బులను అధిక ధరలకు కొనుగోలు చేసినట్లు బిల్లులు చూపించి ప్రజాధనాన్ని వృథా చేశారని పేర్కొన్నారు.ఇటీవల ఎల్ఈడీ లైట్లు,ఇతర ఖర్చుల పేరుతో చెక్కులు సిద్ధం చేసి బిల్లులు సమర్పించగా వాటిలో అవకతవకలు ఉన్నట్లు గుర్తించి చెక్కుల విడుదలను నిలిపివేసినట్లు వార్డు సభ్యులు తెలిపారు.ట్రాక్టర్ డీజిల్ ఖర్చుల పేరుతో కూడా పంచాయతీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే అనుమానాలను వ్యక్తం చేశారు.అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆలస్యం జరిగిందని,తమపై ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ నిధుల వినియోగంపై సమగ్ర విచారణ జరిపి సర్పంచ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.ఫిర్యాదు చేసినవారిలో ఉపసర్పంచ్ దర్శనాల ఆశమ్మతో పాటు వార్డు సభ్యులు సత్యమ్మ,వాణి ఉషన్న,నిఖిల్,కృష్ణ ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments