సొసైటీ,ఆదిలాబాద్ : ఇంధన ధరల పెంపుపై ఆప్ ఆగ్రహం పెట్రోల్,డీజిల్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఆదిలాబాద్ నేతలు తీవ్రంగా ఖండించారు.ఎన్నికలు పూర్తయ్యాక లీటరుకు రూ.3 వరకు ధరలు పెంచడం ప్రజలపై భారం మోపినట్టేనని ఆప్ నాయకురాలు ఆర్.లక్ష్మి విమర్శించారు.డీజిల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయని, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.తెలంగాణలో ప్రజా వ్యతిరేక విధానాలపై ఆప్ పోరాటం కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి.. -ఆప్ నాయకురాలు ఆర్.లక్ష్మి డిమాండ్
RELATED ARTICLES
