Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Friday, June 12, 2026
HomeUncategorized20న మెడికల్ షాపుల బంద్..

20న మెడికల్ షాపుల బంద్..

సొసైటీ,ఆదిలాబాద్ : కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఔషధ విక్రయాల సడలింపులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మే 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ నిర్వహించనున్నట్లు టిటిసిడిఏ, ఏఐఓసీడీ నాయకులు తెలిపారు.సోమవారం ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్‌లో బంద్ కరపత్రాలను సంఘం అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ-ఫార్మసీలు, ఆన్‌లైన్ ఔషధ విక్రయాల వల్ల చిన్న మెడికల్ షాపుల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.కోవిడ్ సమయంలో అమల్లోకి తీసుకొచ్చిన G.S.R 220(E), ఈ-ఫార్మసీలకు సంబంధించిన G.S.R 817(E) నోటిఫికేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఔషధ విక్రయాలపై కఠిన నియంత్రణలు అవసరమన్నారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపుల యజమానులు బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సంఘం జనరల్ సెక్రటరీ సాయినాథ్ రెడ్డి, ట్రెజరర్ రమేష్ గాజుల, వైస్ ప్రెసిడెంట్ మహిపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments