Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Saturday, September 12, 2026
HomeUncategorizedపదిలో ఎస్‌ఆర్‌ విద్యార్థులు టాప్..

పదిలో ఎస్‌ఆర్‌ విద్యార్థులు టాప్..

సొసైటీ,ఆదిలాబాద్ : పదో తరగతి ఫలితాల్లో ఎస్‌ఆర్‌ ప్రైమ్, ఎస్‌ఆర్‌ డిజి పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారని జోనల్ ఇన్‌చార్జి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈసారి నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించి సంస్థకు మంచి పేరు తీసుకువచ్చారని పేర్కొన్నారు.బుధవారం పాఠశాల ఆవరణలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.600 మార్కులకు గాను ఫిరంగి వంశీ 588 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, ధరణి రెడ్డి 583, అన్విత 582, తనుశ్రీ 580 మార్కులు సాధించారు.అక్షర, యోగేశ్వరి ఇద్దరూ 579 మార్కులు సాధించగా, రాచకొండ ప్రశాంతి, చందన 577 మార్కులు పొందారు. అలాగే సింధుజ, ప్రజ్వల్, జయప్రకాష్, అజయ్, వసుధలు 576 మార్కులు సాధించి ప్రతిభ చాటారు.ఈ సందర్భంగా జోనల్ ఇన్‌చార్జి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల కృషి,ఉపాధ్యాయుల అంకితభావం,తల్లిదండ్రుల సహకారంతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు.భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దేవిదాస్, సరిత, రవి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విజయోత్సాహాన్ని పంచుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments