సొసైటీ, ఆదిలాబాద్ :ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్‌గూడ గ్రామానికి చెందిన హామ్లెట్ విలేజ్ రామలగూడలో డ్వాక్రా భవన నిర్మాణానికి బుధవారం భూమిపూజ నిర్వహించారు. ఆదిలాబాద్ రూరల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలిశెట్టి నాగన్న భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మహిళా సంఘాల అవసరాల కోసం నిర్మించనున్న డ్వాక్రా భవనం అందుబాటులోకి వస్తే గ్రామంలోని మహిళలకు సమావేశాలు, ఇతర కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని నాయకులు పేర్కొన్నారు. డ్వాక్రా భవనం నిర్మాణం పూర్తయిన అనంతరం మహిళా సంఘాలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో మహాజన్ సోయం లక్ష్మణ్, కీనాక అశోక్, సార్ల సత్యనారాయణ అయూబ్ తదితరులు పాల్గొన్నారు.
డ్వాక్రా భవన నిర్మాణానికి భూమిపూజ..
RELATED ARTICLES
