సొసైటీ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో నృత్య భూమి నాట్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి వేసవి శిక్షణ తరగతులు ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.చిన్నప్పటి నుంచే పిల్లలకు కళలు, సంస్కృతి, క్రమశిక్షణ నేర్పించడం ద్వారా మంచి వ్యక్తిత్వం పెంపొందుతుందని పేర్కొన్నారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో కూడా ప్రతిభ కనబర్చాలని సూచించారు.తల్లిదండ్రులు తమ పిల్లల్లో సంప్రదాయ విలువలు పెంపొందించేలా ప్రోత్సహించాలని కోరారు. వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.శిబిరంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేశారు.ఈ కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు గ్రహీత, శిక్షకురాలు స్వప్న, డైరెక్టర్ విజయ్ కుమార్, జిల్లా గిరిజన క్రీడల అధికారి కోరేడ్డి పార్థసారథి,సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, కార్యనిర్వాహక కార్యదర్శి కందుల రవీందర్,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
మన సంస్కృతిని భావితరాలకు అందించాలి..
RELATED ARTICLES
