Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Sunday, May 10, 2026
HomeUncategorizedఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ...

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బోరంచు శ్రీకాంత్ రెడ్డి..

సొసైటీ,ఆదిలాబాద్:ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బోరంచు శ్రీకాంత్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది.ఈ మేరకు ప్రభుత్వం జీవోను జారీ చేసింది.మార్కెట్ కమిటీ 4వ వ్యవస్థాపనలో భాగంగా చైర్మన్ పదవిని ఓసీ (జనరల్)కు కేటాయించగా, బోరంచు శ్రీకాంత్ రెడ్డిని చైర్‌పర్సన్‌గా నియమించారు.అలాగే తన్‌వీర్ అహ్మద్‌ను వైస్ చైర్మన్‌గా, రవుల సోమన్న, కుర్సింగ మోతిబాయిని సభ్యులుగా నియమించారు.ఈ కమిటీ రెండు సంవత్సరాల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగనుంది.రైతుబిడ్డగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రెండు దశాబ్దాలుగా ప్రజా సేవలో ఉన్న తనకు ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల బోరంచు శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.రైతుల సంక్షేమం,మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments