ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బోరంచు శ్రీకాంత్ రెడ్డి..
సొసైటీ,ఆదిలాబాద్:ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బోరంచు శ్రీకాంత్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది.ఈ మేరకు ప్రభుత్వం జీవోను జారీ చేసింది.మార్కెట్ కమిటీ 4వ వ్యవస్థాపనలో భాగంగా చైర్మన్ పదవిని ఓసీ (జనరల్)కు కేటాయించగా, బోరంచు శ్రీకాంత్ రెడ్డిని చైర్‌పర్సన్‌గా నియమించారు.అలాగే తన్‌వీర్ అహ్మద్‌ను వైస్ చైర్మన్‌గా, రవుల సోమన్న, కుర్సింగ మోతిబాయిని సభ్యులుగా నియమించారు.ఈ కమిటీ రెండు సంవత్సరాల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగనుంది.రైతుబిడ్డగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రెండు దశాబ్దాలుగా...