సొసైటీ,ఆదిలాబాద్:సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్) కేంద్రాల ద్వారా ఆధార్ కార్డులకు సంబంధించిన సేవలు,వయస్సు మార్పులు లేదా జనన తేదీ సవరణలు నిర్వహించబడవని సీఎస్సీ జిల్లా మేనేజర్ రాహుల్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.సీఎస్సీ కేంద్రాల ద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు మరియు ఇతర ప్రజా సేవలు మాత్రమే అందించడం జరుగుతుందని తెలిపారు.కొంతమంది మీ సేవా,ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకులు కుమ్మక్కై అక్రమంగా సర్టిఫికెట్లు తయారు చేయడం,ఆధార్ వివరాల్లో మార్పులు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోందని,ప్రజలు అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని సూచించారు.ప్రస్తుతం సీఎస్సీ ఆధ్వర్యంలో అధికారిక ఆధార్ కేంద్రం కేవలం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌లో మాత్రమే నిర్వహించబడుతోందని తెలిపారు. ఆధార్‌కు సంబంధించిన సేవల కోసం ప్రభుత్వం గుర్తించిన అధికారిక కేంద్రాలను మాత్రమే సంప్రదించాలని కోరారు.మధ్యవర్తులు,అనధికారిక ఆన్లైన్ సెంటర్లను ఆశ్రయించకుండా,ప్రభుత్వ నిబంధనల ప్రకారం సేవలు అందించే అధికారిక కేంద్రాల ద్వారానే తమ అవసరాలు తీర్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సీఎస్సీ కేంద్రాల్లో ఆధార్ మార్పులు చేయబడవు.. -సీఎస్సీ జిల్లా మేనేజర్ రాహుల్
RELATED ARTICLES
