Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Sunday, March 22, 2026
Homeకార్పెంటర్లలో వృత్తి నైపుణ్యత పెంచడమే లక్ష్యం.. యాక్షన్ టెస్సా డిప్యూటీ జనరల్...

కార్పెంటర్లలో వృత్తి నైపుణ్యత పెంచడమే లక్ష్యం.. యాక్షన్ టెస్సా డిప్యూటీ జనరల్ మేనేజర్ డా.వై.జనార్దన్ రెడ్డి..

ఆదిలాబాద్ : కార్పెంటర్లు ఎన్నో ఏళ్ల నుంచి తమ వృత్తి పరంగా చేతి వృత్తులపైనే ఆధారపడి జీవనాధారం సాగిస్తున్నారు.అలాంటి కార్పెంటర్లలో అధునాతన పరికరాలు పరిజ్ఞానంతో ముందుకు సాగుతూ వారిలో వృత్తి నైపుణ్యతను పెంచే లక్ష్యంతో యాక్షన్ టెస్సా పని చేస్తోందని యాక్షన్ టెస్సా డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ వై.జనార్దన్ రెడ్డి అన్నారు.గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని పంచవతి హోటల్ లో జిల్లాలోని కార్పెంటర్లకు వృత్తి నైపుణ్యతపై అవగాహన కార్యక్రమాన్ని యాక్షన్ టెస్సా ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఇంజనీరింగ్ చెక్క పరిశ్రమకు వడ్రంగులు వెన్నెముక లాంటివారని,కార్పెంటర్లలో ఉన్న నైపుణ్యాన్ని,సృజనాత్మకతను పెంపొందించుకోవాలని సూచించారు.అనంతరం టెస్సా యాక్షన్ ఆధ్వర్యంలో 250 మంది కార్పెంటర్లను శాలువతో ఘనంగా సత్కరించి మెమోంటోలను అందజేశారు.ఈ కార్యక్రమంలో టెస్సా మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ అగర్వాల్ ,యాక్షన్ టెస్సా ఉత్పత్తుల అథారైజ్డ్ డిస్ట్రిబ్యూటర్,శ్రీ గణేష్ ప్లైవుడ్ యజమాని జశ్వంత్ సింగ్,కంపెనీ స్థానిక సీనియర్ ఏరియా సేల్స్ మేనేజర్ శ్రీ సూరజ్ బాషా,అమర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments