అదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన బండారి అనూష సతీష్ దంపతులను టీఎన్జీవో యూనియన్ అదిలాబాద్ జిల్లా పక్షాన శనివారం సన్మానం చేశారు.ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగులు శాలువా, పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపినారు. ఈ సందర్భంగా అనూషకు మిఠాయిలు తినిపించారు.ఈ సందర్బంగా టీఎన్జీవో యూనియన్ అదిలాబాద్ జిల్లా కార్యదర్శి ఎ.నవీన్ కుమార్ మాట్లాడుతూ పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు ఎ.తీర్మల్ రెడ్డి, జిల్లా బాధ్యులు సుజాత , రాధ , టీఎన్జీవో యూనియన్ అదిలాబాద్ పట్టణ కార్యదర్శి కె.అరుణ్ కుమార్, రూరల్ యూనిట్ కార్యదర్శి ఓం ప్రసాద్, గంగాదేవి, శ్రీనివాస్, వెంకటేష్, రజనీకాంత్, కలిము , రామకృష్ణ, శ్రీధర్, వార్డెన్ సంఘం అధ్యక్షులు నర్సింలు పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్మన్ కు టీఎన్జీవోస్ సన్మానం..
RELATED ARTICLES
