Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Friday, April 3, 2026
HomeEducation Newsరైతు కుటుంబాలకు అండగా.. కిసాన్ మిత్ర

రైతు కుటుంబాలకు అండగా.. కిసాన్ మిత్ర

సొసైటీ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో రూరల్ డెవలప్ మెంట్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో కిసాన్ మిత్ర ప్రతినిధులు రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల జీవనోపాధి కల్పిస్తూ అండగా నిలుస్తున్నారు.ఇందులో భాగంగానే జిల్లాలో గడిచిన వారం రోజుల్లో ఆరు కుటుంబాలకు రూ.50 వేల చొప్పున రూ.3లక్షల విలువైన మేకలు,గేదెలు కొనుగోలు చేసి అందించి వారికి ఆర్థిక చేయూత అందించారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లోని రైతు ఆత్మహత్య కుటుంబాలైన ఎడిపెల్లి దేవమ్మ, పిప్పల్ కోటి(భీంపూర్),సోలంకి మౌనిక,కిష్టాపూర్(నేరడిగొండ),నలగంటి సుజాత,పిప్పర్వాడ(భోరజ్),బోకంటి లక్ష్మి,రుయ్యాడి(తలమడుగు), ఈడపు గంగామణి,కన్గుట్ట(బోథ్),కోడె కవిత,శంషాబాద్(బేల) లకు ఆర్థిక సాయం అందించారు.ఇందులో భాగంగానే శనివారం కిసాన్ మిత్ర సభ్యులు మేకల రమాకాంత్ యాదవ్,రాకేష్,షారుఖ్ బాధిత కుటుంబాలకు మేకలు,గేదెలు పంపిణీ చేశారు.రైతులు తమ సమస్యలకై 9490900800 సంప్రదించాలని సూచిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments