Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Friday, July 24, 2026
HomeUncategorizedసనాతన హిందూ ఉత్సవ సమితి కార్యక్రమాలు అభినందనీయం..

సనాతన హిందూ ఉత్సవ సమితి కార్యక్రమాలు అభినందనీయం..

సొసైటీ, ఆదిలాబాద్ :హిందూ ధర్మ పరిరక్షణకు సనాతన హిందూ ఉత్సవ సమితి చేస్తున్న కృషి అభినందనీయమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కొనియాడారు. ఉగాది వేడుకల్లో భాగంగా మఠాధిపతి యోగానంద సరస్వతీ స్వామి,ఎస్పీ అఖిల్ మహాజన్, ఏసీఎన్ ఎండీ ఓం ప్రకాష్ రెడ్డిలతో కలిసి ఆయన నూతన పంచాంగ ప్రతులను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ,ధార్మిక చింతన సమాజానికి అవసరమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్,ఎస్పీ లకు సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి హిందీ పంచాంగం అందించారు.వారు ఆనందంగా పంచాంగాన్ని పటించారు.ఈ కార్యక్రమంలో కోశాధికారి రేణిగుంట రవీందర్ , కార్యనిర్వహక అధ్యక్షులు కందుల రవీందర్ , సభ్యులు మీసాల స్వామి , మామిడి రాజు , అశోక్ రెడ్డి , నర్సోజీ , రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments