Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Sunday, May 10, 2026
HomeUncategorizedఎస్సై విష్ణువర్ధన్ సేవలు అభినందనీయం:ఎస్పీ

ఎస్సై విష్ణువర్ధన్ సేవలు అభినందనీయం:ఎస్పీ

సొసైటీ న్యూస్,ఆదిలాబాద్ : 24 గంటలు పోలీసు విధుల్లో బిజిగా ఉండే ఆ ఎస్సై..సామాజిక బాధ్యతగా తనవంతు సహకారం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై విష్ణువర్ధన్ ఆదివాసీల అభివృద్ధి,నిరుపేద విద్యార్థుల అభివృద్ధికి పాటుపడుతున్న తీరు అందర్నీ ఆకర్షించింది.దీంతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు.కాగా ఆదివాసీల అభివృద్ధిలో భాగంగా విద్యార్థులకు పరీక్ష సామాగ్రి,క్రీడారంగంలో రాణిస్తున్న వారికి క్రీడా కిట్లు అందజేస్తూ సామాజిక దృక్పథాన్ని చాటుతున్నారు.కాగా ఇటీవలే రాష్ట్ర,జాతీయ స్థాయిలో ఆర్చరీ క్రీడల్లో పథకాలు సాధించిన చించుఘాట్ ఆశ్రమ పాఠశాల విద్యార్థినిలు సిడాం రామకల,పెందూర్ రూపలకు రూ.20 వేల విలువ చేసే ఆర్చరీ కిట్లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా గురువారం అందజేశారు.ఈ సందర్భంగా ఎస్సై సేవలను జిల్లా ఎస్పీ అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments