societytelugunews.com
Newspaper Banner
Date of Publish : 05 October 2026 Editor : Society News

గౌడ యువజన సంఘం ఆదిలాబాద్‌ మండల అధ్యక్షుడిగా సాయిరాజ్‌ గౌడ్‌..

సొసైటీ,ఆదిలాబాద్‌ :తెలంగాణ గౌడ యువజన సంఘం ఆదిలాబాద్‌ రూరల్‌ మండల నూతన అధ్యక్షుడిగా అంగళ్వార్‌ సాయి రాజ్‌ గౌడ్‌ను నియమించారు.సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు నరేష్‌ గౌడ్‌ సూచనలు, మార్గదర్శకత్వంలో, ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు గర్రపెల్లి ఆదర్శ్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఈ నియామకాన్ని చేపట్టింది. నూతన అధ్యక్షుడిగా సాయి రాజ్‌ గౌడ్‌ను ఎంపిక చేస్తూ జిల్లా కమిటీ నిర్ణయం తీసుకుంది.ఈ సందర్భంగా జిల్లా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ గౌడ యువతను ఏకతాటిపైకి తీసుకువచ్చి, వారి సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు సంఘాన్ని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేయాలని సూచించారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సాయి రాజ్‌ గౌడ్‌ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మండల అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సంఘం ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ మండలంలోని గౌడ యువతను సమన్వయం చేసుకుని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలను నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలోని వివిధ గ్రామాల్లో సంఘం కార్యకలాపాలను విస్తరించి, యువతను పెద్ద సంఖ్యలో సంఘంలో భాగస్వాములను చేయాలని జిల్లా కమిటీ ఆకాంక్షించింది. సామాజిక సేవా కార్యక్రమాలు, యువత సంక్షేమం, గౌడ సమాజ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించాలని సూచించింది. సాయి రాజ్‌ గౌడ్‌ నియామకం పట్ల పలువురు గౌడ సంఘం నాయకులు, యువత హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.