సొసైటీ,ఆదిలాబాద్:ఆదిలాబాద్ పట్టణంలోని మాజీ మంత్రి సీఆర్ఆర్ నివాసంలో నిర్వహించిన తేనేటి విందుకు ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి స్వర్గీయ చిలుకూరి రామచంద్రరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అల్లూరి సంజీవరెడ్డి, చిలుకూరి లక్ష్మారెడ్డి,న్యాయవాది వై.సంజయ్‌రెడ్డి వారి కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసి ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సచిన్ సావంత్, నరేష్ జాదవ్ ఆత్మీయంగా సమావేశమయ్యారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్,మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి,మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్,టీపిసీసీ ఎస్సీ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్,టీపీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత,బెజ్జంకి అనిల్‌కుమార్, అంబకంటి అశోక్, అన్నపూర్ణ, గౌలి సంజయ్, గోక గణేష్‌రెడ్డి, తొడసం దౌలత్‌రావు, డేరా కృష్ణారెడ్డి, రుక్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.