societytelugunews.com
Newspaper Banner
Date of Publish : 05 September 2026 Editor : Society News

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న నర్ర నవీన్ యాదవ్

సొసైటీ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్‌కే కాలనీ ఎంయూపీఎస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల హెచ్ఎం నర్ర నవీన్ యాదవ్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. గురుపూజోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా ఆయన ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని స్వీకరించారు. విద్యార్థుల విద్యాభ్యాసం, పాఠశాల అభివృద్ధి, విద్యా ప్రమాణాల మెరుగుదలకు చేసిన కృషిని గుర్తిస్తూ ఈ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు.ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికై పురస్కారం అందుకున్న నర్ర నవీన్ యాదవ్‌ను పలువురు ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, కాలనీవాసులు అభినందించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారిలో ప్రతిభను వెలికితీసేందుకు హెచ్ఎం చేస్తున్న కృషి అభినందనీయమని వారు పేర్కొన్నారు.