societytelugunews.com
Newspaper Banner
Date of Publish : 04 September 2026 Editor : Society News

దిశ కమిటీలో గాజుల సన్నీకి చోటు..

సొసైటీ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ దిశ లో గాజుల ప్రద్యుమ్న (సన్నీ)ను సభ్యుడిగా నియమించారు.భోరజ్‌ మండలం గిమ్మా గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఉన్న ఆయనకు సర్పంచ్‌ ప్రజా ప్రతినిధి కేటగిరీలో ఈ అవకాశం కల్పించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన పథకాల అమలు, జిల్లా అభివృద్ధి కార్యక్రమాల సమన్వయం, పర్యవేక్షణలో డిశా కమిటీ కీలకంగా వ్యవహరిస్తుంది. కమిటీ సభ్యుడిగా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని ప్రద్యుమ్న తెలిపారు. తనకు అవకాశం కల్పించిన ఎంపీ గోడం నగేష్,ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా అధ్యక్షుడు పతంగె బ్రహ్మానంద్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.