societytelugunews.com
Newspaper Banner
Date of Publish : 07 July 2026 Editor : Society News

ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం.. ఎస్పీకి ఫిర్యాదు..

సొసైటీ,ఆదిలాబాద్ :సోషల్ మీడియాలో తన తల్లిదండ్రులు,ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఉమపై అసత్య, నిరాధార ఆరోపణలు చేస్తూ పరువు నష్టం కలిగించేలా ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పాయల్ శరత్ కుమార్ మంగళవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌కు వినతిపత్రం అందజేశారు. ట్విట్టర్ (ఎక్స్), ఫేస్‌బుక్, యూట్యూబ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో తమ కుటుంబంపై భూములు, ఆస్తులకు సంబంధించిన నిరాధార ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ముఖ్యంగా ఒక సోషల్ మీడియా పేజీలో ఎలాంటి అధికారిక విచారణ, న్యాయస్థాన నిర్ధారణ లేకుండానే తప్పుడు కథనాలు ప్రచురించారని,వాటి వల్ల కుటుంబ పరువు ప్రతిష్ఠలకు భంగం కలుగుతోందని తెలిపారు.ఈ ప్రచారంపై సైబర్ విభాగం ద్వారా సమగ్ర విచారణ జరిపి,అసత్య ప్రచారం చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.