సోసైటీ,ఆదిలాబాద్:ఆదిలాబాద్ పట్టణంలోని ఎంఫీయూపీఎస్ కేఆర్‌కే కాలనీ తెలుగు మీడియం పాఠశాల ఆధ్వర్యంలో విద్య ప్రాముఖ్యత,ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ పాఠశాల నుంచి ప్రారంభమై కాలనీలోని పలు వీధుల గుండా సాగింది. విద్యార్థులు,ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫారాలు తదితర సౌకర్యాల గురించి ప్రజలకు వివరించారు.తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని తల్లిదండ్రులను కోరారు.ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ రజిత రాము మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.పాఠశాల హెడ్‌మాస్టర్ నవీన్ యాదవ్ మాట్లాడుతూ..విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు కృషి చేస్తున్నాయని,తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీరామ్, సునీత, శ్రావణి, సుకన్య, దేవత, రాజమణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.