సొసైటీ,ఆదిలాబాద్ :టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన బీసీ సమావేశంలో ఆదిలాబాద్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.సమావేశంలో బీసీ వర్గాల సమస్యలు, సంక్షేమం, రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించినట్లు నాయకులు తెలిపారు.ఈ సమావేశంలో ఆదిలాబాద్ జిల్లా నాయకులు రంగినేని శ్రీనివాస్,అసపు ప్రమోద్ కుమార్,జుట్టు చంద్రశేఖర్ పాల్గొన్నారు.పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని,బీసీ వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సమావేశంలో పిలుపునిచ్చినట్లు తెలిపారు.