సొసైటీ,ఆదిలాబాద్:ఇటీవల ఆదిలాబాద్ జిల్లా విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి మాధవి గారిని పి ఆర్ టి యూ తెలంగాణ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా రాబోయే వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న పాఠశాలలకు ప్రాధాన్యత ఇవ్వాలని సంఘం ప్రతినిధులు డీఈవోను కోరారు.జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు,అధికారులు సమన్వయంతో పనిచేసి సహకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు ఆడే నూర్ సింగ్,జిల్లా కార్యదర్శి నర్రా నవీన్ యాదవ్,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కనక అభిమాన్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బి. విఠల్ గౌడ్,జిల్లా గౌరవ అధ్యక్షుడు డి.బాబన్న,జిల్లా కోశాధికారి ముజీబ్,అలాగే జాదవ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.