అనాథ శవానికి అంత్యక్రియలు..
సొసైటీ,ఆదిలాబాద్:ఆదిలాబాద్ పట్టణంలోని బస్టాండ్ డౌన్ ప్రాంతంలో గుర్తుతెలియని ఓ మహిళ మృతి చెందింది.ఆమెకు సంబంధించిన బంధువులు లేదా కుటుంబ సభ్యులు ఎవరూ గుర్తించబడకపోవడంతో పోలీసులు మానవతా దృక్పథంతో సేవా సంస్థలను సంప్రదించారు.ఈ సందర్భంగా మానవ సేవే మాధవ సేవ సమితి అధ్యక్షుడు కనక నర్సింగ్, తెలంగాణ రెడ్డి సంఘం జిల్లా నాయకుడు గోపీడీ సవీణ్ రెడ్డి స్పందించి మహిళకు అంత్యక్రియలు నిర్వహించారు.మృతదేహానికి గౌరవప్రదంగా చివరి సంస్కారాలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో సల్ల శైలేందర్,పోలీసులు,సిబ్బంది పాల్గొన్నారు.సమాజానికి ఆదర్శంగా...