సొసైటీ,ఆదిలాబాద్: తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా ఎన్నుకోబడిన గోడం గణేష్‌ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సంఘ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కె.రాజు,రాష్ట్ర కార్యదర్శి భాస్కర్,ఉపాధ్యక్షులు వెట్టి మనోజ్,కోలం సేవా సంఘం అధ్యక్షుడు కోడప సోనారావు, కుమర రాజు,ప్రముఖ వ్యాపార వేత్త మస్కరి పోతన్న తదితరులు పాల్గొన్నారు.