సొసైటీ,ఆదిలాబాద్ :పర్యాటక వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కంటెంట్ క్రియేటర్ల పోటీల్లో ఆదిలాబాద్‌కు చెందిన “పవన్ Vlogs Adilabad” కు ప్రశంసా పత్రం లభించింది. వీడియోల నాణ్యత, సమయపాలన, సోషల్ మీడియాలో వచ్చిన అత్యధిక వీక్షణల ఆధారంగా విజేతలను ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.చారిత్రక కట్టడాలు, ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అందాలు, ప్రముఖ దేవాలయాలు, ఆదివాసీ సంస్కృతి, పండుగలకు సంబంధించిన వీడియోలను రూపొందిస్తూ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వేదికల్లో “Pavan Vlogs Adilabad” మంచి ప్రజాదరణ పొందింది.ఈ సందర్భంగా పవన్‌కు ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు.