ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అవకతవకలు..?
సొసైటీ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని 4వ వార్డు బంగారుగూడలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మంచాల మల్లయ్య ఆరోపించారు.నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కేవలం నేలపైనే ఇటుకలు పేర్చి,కింద బెడ్లు వేసి పనులు పూర్తైనట్లుగా చూపిస్తూ బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆయన విమర్శించారు.ఇందిరమ్మ హౌసింగ్ ఏఈ సంబంధిత కాంట్రాక్టర్‌కు సహకరిస్తూ పూర్తి స్థాయిలో పనులు జరగకపోయినా బిల్లులు ఇప్పిస్తున్నారని ఆరోపించారు.మరో ఇంటికి కూడా ఇదే విధంగా స్లాబ్ వేసినట్లు చూపించి బిల్లు మంజూరు...