societytelugunews.com
Newspaper Banner
Date of Publish : 17 May 2026 Editor : Society News

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అవకతవకలు..?

సొసైటీ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని 4వ వార్డు బంగారుగూడలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మంచాల మల్లయ్య ఆరోపించారు.నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కేవలం నేలపైనే ఇటుకలు పేర్చి,కింద బెడ్లు వేసి పనులు పూర్తైనట్లుగా చూపిస్తూ బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆయన విమర్శించారు.ఇందిరమ్మ హౌసింగ్ ఏఈ సంబంధిత కాంట్రాక్టర్‌కు సహకరిస్తూ పూర్తి స్థాయిలో పనులు జరగకపోయినా బిల్లులు ఇప్పిస్తున్నారని ఆరోపించారు.మరో ఇంటికి కూడా ఇదే విధంగా స్లాబ్ వేసినట్లు చూపించి బిల్లు మంజూరు చేశారని తెలిపారు.ఇంకా రెండు ఇళ్లు ప్రారంభ దశలోనే ఉండగా వాటికీ బిల్లుల ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు.ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్న వారిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని,నాణ్యత లేని నిర్మాణాలతో లబ్ధిదారులను మోసం చేస్తున్న కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మంచాల మల్లయ్య డిమాండ్ చేశారు.అలాగే నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు.