దుబ్బగూడలో అంగన్వాడి భవనానికి భూమిపూజ..
సొసైటీ,ఆదిలాబాద్: మావల మండలం బట్టి సావర్గాం గ్రామపంచాయతీ దుబ్బగూడలో రూ.12 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడి భవనానికి సోమవారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. గౌరవ ఎంపీ నగేష్,ఎమ్మెల్యే పాయల్ శంకర్ కృషితో భవనం మంజూరైనట్లు గ్రామస్థులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డ్ సభ్యులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎంపీ,ఎమ్మెల్యేలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.