సొసైటీ,ఆదిలాబాద్: అదిలాబాద్ బులియన్ మార్కెట్ ఎన్నికలు ఆదివారం స్థానిక గుజరాత్ సమాజ్ సంఘభవనంలో నిర్వహించారు.ఈ ఎన్నికల్లో ఆ సంఘం అధ్యక్షుడిగా బొల్లు దేవిదాస్, ప్రధాన కార్యదర్శిగా కట్ట రాజు లు భారీ మెజారిటీ తో గెలుపొందారు.ఈ సందర్బంగా అధ్యక్షుడిగా ఎన్నికైన దేవిదాస్ మాట్లాడుతూ..ప్యానెల్ గెలుపుకు సహకరించిన గోల్డ్ & సిల్వర్ మర్చేంట్ ప్రతినిదు లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బులియన్ మార్కెట్ అభివృద్ధి సంక్షేమనికి కృషి చేస్తానని, తనపై నమ్మకం ఉంచి ఓటువేసి గెలిపించినందుకు నమ్మకంతో పనిచేస్తానని తెలిపారు.అనంతరం కొత్తగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులకు సంఘం తరపున సభ్యులు కోటోజు భాస్కరచారి,కె మిలన్ కుమార్,బ్రహ్మం,పురుషోత్తం,రవి,సంతోష్ తదితరులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.