సొసైటీ,ఆదిలాబాద్: కిరాణా సరుకుల డబ్బులు అడిగిందనే కారణంతో ఓ మహిళను దూషించి బెదిరించిన వ్యక్తిపై మావల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టలవాడకు చెందిన కాంబ్లే అనార్కల తన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం..పోట్‌పోడే దయానంద్ గతంలో తన కిరాణా దుకాణంలో రూ.17 వేల విలువైన సరుకులు తీసుకుని డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నాడని పేర్కొన్నారు.ఈ నెల 9న డబ్బుల విషయమై ప్రశ్నించగా దయానంద్ ఆగ్రహంతో అసభ్య పదజాలంతో దూషించి,చంపేస్తానంటూ బెదిరించాడని ఫిర్యాదులో తెలిపారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు మావల పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.