Processing...
  societytelugunews.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన కేమ శ్రీవల్లి..

సొసైటీ,ఆదిలాబాద్:ఆదిలాబాద్ రూరల్ మండలంలోని వాన్వాట్ గ్రామానికి చెందిన కేమ లలిత–కిష్టయ్య దంపతుల కుమార్తె కేమ శ్రీవల్లి ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చదువుతున్న ఆమె, తాజాగా విడుదలైన ఫలితాల్లో 1000 మార్కులకు గాను 916 మార్కులు సాధించి ‘ఏ’ గ్రేడ్ కైవసం చేసుకుంది.శ్రీవల్లి సాధించిన విజయంపై తల్లిదండ్రులు, గ్రామస్తులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు.

Read Full Article

Share with friends