Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Friday, April 3, 2026
HomePolitical newsపేదల సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్.. -కాంగ్రెస్ నేత అల్చెట్టి...

పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్.. -కాంగ్రెస్ నేత అల్చెట్టి నాగన్న

సొసైటీ,ఆదిలాబాద్:ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జీ కంది శ్రీనివాస రెడ్డి,డీసీసీ అధ్యక్షుడు నరేష్‌ జాదవ్,ఆత్మ కమిటీ చైర్మెన్ గిమ్మ సంతోష్ ల సహకారంతో మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తున్నామని ఆదిలాబాద్ రూరల్ మండల కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అల్చెట్టి నాగన్న అన్నారు.సోమవారం మండలంలోని యాపల్‌గూడ గ్రామంలో గౌరుబాయి రాజేశ్వర్‌ దంపతులు ఇందిరమ్మ పథకం కింద నిర్మించుకున్న గృహా ప్రవేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఆ దంపతులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన అల్చెట్టి నాగన్న మాట్లాడుతూ..ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం దశల వారీగా సకాలంలో బిల్లులు అందజేయడం జరుగుతుందన్నారు.పేదల సొంతింటి కల నేరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సినియర్‌ నాయకులు చర్ల సత్యనారాయణ,ఉష్కమల్ల కాంతారావ్,ఉష్కమల్ల లస్మన్న,సిటీ నర్సింగ్,చెలకాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments