societytelugunews.com
Newspaper Banner
Date of Publish : 29 March 2026 Editor : Society News

కాంగ్రెస్ నేతకు ఘన నివాళులు..

సొసైటీ,ఆదిలాబాద్:కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంచాల పోతన్న పెద్దకర్మ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత రూరల్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అల్చెట్టి నాగన్న హాజరయ్యారు.శనివారం ఆదిలాబాద్ రూరల్ మండలం అనుకుంట గ్రామంలోని స్వగృహనికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఆయనతో అనుబంధంగా ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు.ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు మంచాల మల్లయ్య,శంకరయ్య,ఆశన్న తదితరులు పాల్గొన్నారు.