సొసైటీ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఉగాది వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించి,నాయకులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి,గండ్రత్ సుజాత తదితరులు పాల్గొన్నారుఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పరభావ నూతన సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ గారు, తదనంతరం పార్టీ నాయకులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజలందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల మేలవింపే మన జీవితం అని ఈ నూతన సంవత్సరంలో రైతులకు మంచి పంటలు పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు. ప్రజలందరూ ఐక్యమత్యంతో ఈ పండుగ జరుపుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి మాజీ జనరల్ సెక్రెటరీ గండ్రత్ సుజాత గారు, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి గారు, ఆదిలాబాద్ మాజీ డిసిసి అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు, ఆదిలాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు గారు,ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మునిగిల నర్సింగ్ గారు, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ సామ రూపేష్ రెడ్డి గారు, కౌన్సిలర్లు చరణ్ గౌడ్ గారు, మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్ గారు, కాంబ్లె మంగేష్ గారు, జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ వేముల నాగరాజు గారు, తొడసం దౌలత్ రావు గారు, గౌలి సంజయ్ గారు, సేవాదళ్ జిల్లా సెక్రెటరీ అప్సర్ ఖాన్ గారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..