సొసైటీ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని వార్డ్ నెంబర్ 20 భాగ్యనగర్ కాలనీలో రెండు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మజూరయ్యాయి.కాగా ఆ పేద కుటుంబాలకు ఇల్లు నిర్మించుకునే స్తోమత లేకపోవడంతో ఆ వార్డ్ బీజేపీ కౌన్సిలర్ పద్మావార్ రాకేష్ అండగా నిలిచారు.ఆ రెండు ఇందిరమ్మ ఇళ్ల మొదటి దశ నిర్మాణం పూర్తయ్యే వరకు రూ.1.5 లక్షల చొప్పున సొంత నిధులతో నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా సోమవారం ఆ రెండు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా కాలనీవాసులు కౌన్సిలర్ ను అభినందించారు.