societytelugunews.com
Newspaper Banner
Date of Publish : 01 March 2026 Editor : Society News

ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేక నోటిఫికేషన్ ఎప్పుడు..? -జాదవ్ సుమేష్

సొసైటీ,ఆదిలాబాద్:ఏజెన్సీ ప్రాంతాలలో నిరుద్యోగుల ఆధ్వర్యంలో,ఏజెన్సీ డీఎస్సీ సాధన సమితి ప్రధాన కార్యదర్శి జాదవ్ సుమేష్ ఆధ్వర్యంలో, అలాగే నిరుద్యోగుల జేఏసీ నాయకత్వంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఏజెన్సీ ప్రాంతాలలో ఖాళీగా ఉన్న పోస్టులపై ప్రత్యేక నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు..? 100% రిజర్వేషన్ కలిగిన ఏజెన్సీ ప్రాంతాలలో స్థానిక గిరిజన నిరుద్యోగులకు న్యాయం చేయడంలో ఎందుకు ఆలస్యం..?కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు ప్రారంభమవుతుంది?ఉద్యోగాల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలతో జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలకు తక్షణమే ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని,ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాలకు స్పష్టమైన షెడ్యూల్ ఇవ్వాలి.ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తప్పనిసరిగా విడుదల చేయాలి.రిజర్వేషన్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి.ఏజెన్సీ నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.