యువనేత వాజిద్ ఖాన్ కు ఘన సన్మానం..
సొసైటీ న్యూస్,ఆదిలాబాద్: ఆదీవాసీ పర్ధాన్ సమాజ్ గోండి ధర్మగురు హీరా జయంతి వేడుకలను బంగారుగూడలో హీరా సుకా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.సంప్రదాయబద్ధంగా డోలువాయిద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమానికి అనుకుంట కౌన్సిలర్ మంచాల సరిత పెద్దమల్లయ్య ముఖ్యతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా యువనేత వాజిద్ ఖాన్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు.