societytelugunews.com
Newspaper Banner
Date of Publish : 28 February 2026 Editor : Society News

శిక్షణ శిబిరం సద్వినియోగం చేసుకోవాలి : మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే

సొసైటీ న్యూస్,ఆదిలాబాద్ : పద్మశ్రీ అవార్డు నామిని 2026 హైదరాబాద్ కు చెందిన జాతీయస్థాయి దర్శకులు, కవి దెంచనాల శ్రీనివాస్ అనేక నాటకాలను తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశం మొత్తం ప్రదర్శింపజేసిన గొప్ప పేరుపొందిన వ్యక్తినని ఆయన ఆదిలాబాద్ జిల్లా కళాకారులతో ఒక నాటకాన్ని వేయాలనే ఉద్దేశంతో వస్తున్నారని ప్రముఖ కవి సామాజిక కార్యకర్త,మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే తెలిపారు.శుక్రవారం సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.మార్చి 1,2 తేదీల్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ సంఘ భవనంలో ఉదయం 9.30 గంటల నుంచి ఆడిషన్స్ జరిపి కళాకారుల ఎంపిక చేయనున్నారని పేర్కొన్నారు.కీ బోర్డు,హార్మోనిస్ట్,తబల, డోలక్ వాయిధ్యకళాకారులు హాజరుకావాలన్నారు.వివరాలకు 9848326517,9182726300 సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంగీతం మాస్టర్ మల్లెల కబీర్దాస్, తబలా మాస్టర్ కు ర్సేంగే పవన్, ఉద్దవ్,డాన్స్ మాస్టర్ రాచర్ల మహేశ్, కొరియోగ్రాఫర్ బెల్లపు రమేశ్, డోలక్ మాస్టర్ సీతారాం, కెమెరామెన్ ప్రహ్లాద్ పాల్గొన్నారు.