societytelugunews.com
Newspaper Banner
Date of Publish : 28 February 2026 Editor : Society News

విద్యా కమిషన్ వ్యాఖ్యలు సరికావు : PRTU జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణకుమార్..

సొసైటీ న్యూస్,ఆదిలాబాద్ : టీచర్ల జీతాలు ఎక్కువగా ఉన్నట్లు విద్యాకమిషన్ వ్యాఖ్యానించడం సరికాదని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొమ్ము కృష్ణకుమార్,నర్సింహస్వామి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.రావాల్సిన వేతన ప్రయోజనాలు సమయానికి అందడం లేదని, పెరుగుతున్న ధరల నేపథ్యంలో డీఏలు చెల్లించకపోతే వాస్తవ ఆదాయం తగ్గినట్లేనని తెలిపారు.రిటైర్డ్ ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ, పెన్షన్ బకాయిల చెల్లింపులో మరింత జాప్యం చేయడం బాధాకరమని పేర్కొన్నారు.ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పేవాడే కాదని,ఎన్నికల విధులు,సర్వేలుపరిపాలన పనులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.