నిరుద్యోగులకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్.. -జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.రమేష్..
సొసైటీ న్యూస్,ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులకు 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ అందించనున్నట్లు జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.రమేష్ తెలిపారు.రాష్ట్ర, కేంద్ర ఉద్యోగాల కోసం హాస్టల్ వసతి, శిక్షణ, రూ.3,000 పుస్తకాలు, 12 నోట్‌బుక్స్, కాస్మోటిక్స్ చార్జీలు ఇస్తామన్నారు.ఈ నెల 22 వరకు tsstudycircle.co.in చేసుకోవాలని సూచించారు.మరిన్ని వివరాల కోసం 9494149416 సంప్రదించాలన్నారు.