societytelugunews.com
Newspaper Banner
Date of Publish : 19 February 2026 Editor : Society News

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీకి సన్మానం..

సొసైటీ న్యూస్,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా నందు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ లోని సర్పంచ్ మరియు పురపాలక ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన లు జరుగకుండా తమదైన శైలిలో ప్రశాంత వాతావరణంలో జరిపించి నందుకు సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి తన సభ్యులతో కలిసి జిల్లా SP శ్రీ అఖిల్ మహాజన్ గారి కి శాలువాతో సత్కరించి దేవుని ప్రతిమ ను అందించడం జరిగింది రాబోయే ఎన్నికలు కూడా ఇదేవిధంగా జరగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, కోశాధికారి రేణుకుంట రవీందర్, సభ్యులు ఉరాడే సుభాష్, నర్సింలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.