సొసైటీ న్యూస్,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఇటీవలే గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థులు సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.ఇందులో భాగంగానే ఆదిలాబాద్ పట్టణంలోని 6వ వార్డులో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి బూర్ల నర్మద-శంకరయ్య ప్రమాణ స్వీకారం చేశారు.వార్డులోని సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ సందర్భంగా నూతన కౌన్సిలర్ కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.