సొసైటీ న్యూస్,ఆదిలాబాద్:ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 36వ వార్డును బీజేపీ కైవసం చేసుకుంది.ఆ పార్టీ అభ్యర్థిని పవర్ సూచిక-మనోజ్ మొత్తం 924 ఓట్లు రాగా,తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 419 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.అధికారులు ఫలితాన్ని ప్రకటించడంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలారు.