ఆదిలాబాద్ : సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు హిందూ ధర్మ పరిరక్షణకై కృషి చేస్తున్న సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి సేవలు అభినందనీయమని మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులు అన్నారు.ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రమోద్ కుమార్ ఖత్రిని శాలువాతో ఘనంగా సన్మానించారు.26 జనవరి రోజున కలెక్టర్ చేతుల మీదుగా సామాజిక సేవకు గాను ప్రశంసా పత్రాన్ని అందుకున్న ప్రమోద్ కుమార్ ఖత్రిని శాలువాతో సత్కరించి అభినందించారు.ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు శంకర్ దాస్,మాజీ సైనికులు రాజు,సంతోష్ ,వామన్,శ్రీకాంత్ ,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.