ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రంలో నిర్వహించిన సంబురంలో స్థానిక కాన్వెంట్ స్కూల్ కు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.చిన్న పిల్లలలో సృజనాత్మకత,ఆసక్తి పెంపొందించడంలో ఆకాశవాణి పాత్ర కీలకమని ఆకాశవాణి ప్రోగ్రాం డైరెక్టర్ రామేశ్వర్ కేంద్రే తెలిపారు.పిల్లల కోసం ప్రత్యేకంగా సంబురం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆకాశవాణి యాజమాన్యానికి ఉపాధ్యాయురాలు కంది నిఖిత ధన్యవాదాలు తెలిపారు.