Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Monday, March 23, 2026
HomeUncategorizedగుప్తనిధుల పేరుతో భారీ మోసం..

గుప్తనిధుల పేరుతో భారీ మోసం..

గుప్త నిధుల పేరుతో జరుగుతున్న భారీ మోసాలను పోలీసులు గుట్టురట్టు చేశారు. దాదాపు 26 మంది బాధితులు కోటి వరకు చెల్లించుకొని మోసపోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను శుక్రవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. భీంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్పల్ కోటి గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు ఏ1 దర్శనాల రాజ్ కుమార్ గత మూడు సంవత్సరాల క్రితం తనకు దేవర (పూనకం) వస్తుందని, తనకు మంత్ర శక్తి ఉందని చుట్టూ పక్కల గ్రామాల వారిని నమ్మించాడు. ప్రజలు అతనిని నమ్మి అతని వద్ద వచ్చి తమ బాధలను, కష్ట సుఖాలను చెప్పేవారు. వారికి తన మంత్ర శక్తి ద్వారా కష్టాలను దూరం చేస్తానని నమ్మించడంతో చాలామంది పరిచయం అయ్యారు. అదే క్రమంలో కొంతమందితో అతను, నేను మంత్ర శక్తి ద్వారా బంగారం తవ్విస్తాను, అని నమ్మించి వారినుండి ఇష్టం వచ్చినట్టు డబ్బులు తీసుకొని అతని బావ మహేందర్, మిత్రులు నవీన్, అరుణ్, శ్యామ్, అఖిల్, కిరణ్ లతో కలిసి పథకం ప్రకారం గుప్త నిధులు ఉన్నాయంటూ చెప్పిన వారి ఇంటికి వెళ్ళి అతని మిత్రుల సాయంతో గుంతను తవ్వించాడు. అందులో నుండి తనతో ముందుగా తీసుకొచ్చిన కుండలో మట్టి ఆన్లైన్ ఫ్లిప్కార్ట్ కార్డ్ ద్వారా ఆర్డర్ చేసిన నకిలీ నాణేలు కుండలో పెట్టి, ఆ కుండను తవ్వకం లో వెళ్ళినట్టు సృష్టించి దూరం నుండి నకిలీ నాణేలు చూపెట్టి, నమ్మించి తర్వాత ఒక ఎర్రని బట్టతో ఆ కుండను చుట్టి దానికి 41 రోజులు దాన్ని ముట్టకుండా, పూజలు చేయాలని తర్వాత అతను వచ్చి తీసిస్తానని చెప్పి నమ్మించి డబ్బులు తీస్కొని పారిపోయేవాడు. ముందే పూజ చేసిన బిందె తీస్తే తీసిన వారు చనిపోతారని భయపెట్టి వెళ్తారు. ఆ విధంగా నేరస్థుడు దర్శనాల రాజు తన మిత్రులైన నవీన్, అరుణ్, శ్యామ్ అఖిల్, కిరణ్ బావ మహేందర్ లతో కలిసి మొత్తం 26 మంది వద్ద నుండి రూ.1,03,80,000 తీసుకొని మోసాగించినట్లు దర్యాప్తులో తేలింది. ఇదివరకే వీరిపై జిల్లాలోని భీంపూర్, పోలీస్ స్టేషన్ లో 6, మావల పోలీస్ స్టేషన్లో ఒకటి, నేరడిగొండ పోలీస్ స్టేషన్లో ఒకటి, బోథ్ పోలీస్ స్టేషన్ లో రెండు, రూరల్ పోలీస్ స్టేషన్ లో ఒకటి, జైనథ్ పోలీస్ స్టేషన్ లో ఒకటి, మొత్తం 12 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని వీరి ద్వారా మోసపోయిన బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే నిర్భయంగా జిల్లా పోలీసులను సంప్రదించవచ్చని తెలిపారు. డబ్బులు ఊరికే రావని నకిలీ బాబాలను నమ్మి ప్రజలు డబ్బులను చెల్లించకూడదని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. నిందితుల వద్ద నుండి ఒక షిఫ్ట్ డిజైర్ కారు, ఒక బైకు, 7 మొబైల్ ఫోన్లను, గుప్త నిధుల పేరుతో మోసం చేసిన నకిలీ బంగారు నాణాలు, కుండలు, పలు బట్టలు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. కేసును చేదించడంలో కీలక పాత్ర పోషించిన జైనథ్ సిఐ, బీంపూర్ ఎస్సై సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో డిఎస్పి ఎల్. జీవన్ రెడ్డి, సిఐలు జి శ్రావణ్, ఎస్సై విక్రమ్, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments